ఈ సందర్భంగా డాక్టర్ రవిశంకర్ నాయక్ మాట్లాడుతూ మహిళా సాధికారతతోనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వచ్చి సమాజ అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. సమాజంలో సమాన అవకాశాలు కల్పించడం ద్వారా మహిళల అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని తెలిపారు.
కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రిలో సేవలు అందిస్తున్న మహిళా వైద్యులు, మహిళా నర్సింగ్ సిబ్బందిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. జనరల్ మెడిసిన్ వైద్యులు డాక్టర్ శ్రీవాణి మహిళా నర్సింగ్ అధికారులను ప్రత్యేకంగా అభినందిస్తూ శాలువాలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో నర్సింగ్ సూపరింటెండెంట్ మంజుల, హెడ్ నర్స్ పద్మ, రాధా, సునీత, స్వేత, ముత్యం, నర్సింగ్ అధికారులు జానకిదేవి, మరియమ్మ, సరస్వతి, పుష్పలత తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆసుపత్రి సిబ్బంది ఆనంద్, కేశవ్, మల్లేష్, భీమ్ లాల్, అరుణ్, కిరణ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొని మహిళా సిబ్బందిని అభినందించారు. మహిళా వైద్యులు మరియు నర్సింగ్ సిబ్బంది ఆరోగ్య సేవల్లో చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ప్రశంసించారు.: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
