కార్యక్రమం ఉదయం 9 గంటలకు ప్రారంభమై సుమారు 11 గంటల వరకు కొనసాగనుంది. అనంతరం అభిమానులను కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. భక్తి కార్యక్రమం ముగిసిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి తదుపరి ప్రయాణానికి బయలుదేరనున్నారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడంతో స్థానికంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామంలో భద్రతా ఏర్పాట్లు కూడా చేపట్టనున్నట్లు సమాచారం. కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, సాంప్రదాయరీతిలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు: రేపు తుమ్మనిపేట లో విజయ్ దేవరకొండ రష్మిక మందన

