జిల్లాలో గుర్తించిన 20 మండలాల నుంచి ఎంపికైన పాఠశాలలకు చెందిన ఏడో మరియు తొమ్మిదో తరగతి విద్యార్థులు, ప్రహరీ క్లబ్ ఇన్‌చార్జి ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ, ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు తమ తమ పాఠశాలలతో పాటు కాంప్లెక్స్ స్థాయిలో ఇతర విద్యార్థులకు డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తారని తెలిపారు.
నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి సీఐ శంకర్ నాయక్ మాట్లాడుతూ పాఠశాలల్లో ప్రహరీ క్లబ్‌ల ఏర్పాటు ద్వారా డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో విద్యార్థులు తమ బాధ్యతను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్‌గా తిరుపతయ్య, లక్ష్మీ ప్రసన్న వ్యవహరించారు. పోలీస్ శాఖ నుంచి నార్కోటిక్ కానిస్టేబుల్ వీరయ్య, తాడూరు ఎంఈఓ త్యాగరాజు, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు లత తదితరులు పాల్గొన్నారు.: విద్యార్థులు యాంటీ డ్రగ్ సోల్జర్స్‌గా మారాలి


