ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధ్యులను గుర్తించి చట్టపరంగా కఠిన శిక్షలు అమలు చేయాలని, అట్రాసిటీ కేసులు నమోదు చేసి బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలని కోరారు. చిన్నారి కుటుంబానికి విశ్వ హిందూ పరిషత్ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
దేవాలయాల్లో అన్ని కులాల వారికి సమాన దైవదర్శనం కల్పించాలని, అన్ని కులాల సమాహారమే సనాతన హిందుత్వమని స్పష్టం చేశారు. విహెచ్పీ బృందం నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు అందజేసింది. అనంతరం బాధిత తల్లిదండ్రులను పరామర్శించి మౌనం పాటించి నివాళులు అర్పించారు.
సామాజిక సమరసతకే తమ సంస్థ పెద్దపీట వేస్తుందని, ఇలాంటి అమానుష ఘటనలు పునరావృతం కాకుండా పోరాటం కొనసాగిస్తామని విహెచ్పీ నేతలు స్పష్టం చేశారు.: అంటరానితనాన్ని క్షమించబోమని విశ్వ హిందూ పరిషత్ హెచ్చరిక
