మహాశివరాత్రి సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని ప్రసిద్ధ ఉమామహేశ్వరం స్వామి ఆలయంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. తెల్లవారుజాము నుంచే వేలాదిగా భక్తులు తరలివచ్చారు. దర్శనానికి కనీసం గంట సమయం పడుతుండటంతో ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

భక్తుల భద్రత దృష్ట్యా కొండపైకి ప్రైవేట్ వాహనాలను అనుమతించలేదు. ఆలయ యాజమాన్యం ఏర్పాటు చేసిన టెంపుల్ బస్సుల ద్వారానే కొండపైకి భక్తులను తరలిస్తున్నారు. బస్సులు అందుబాటులో లేని సమయంలో కొందరు భక్తులు నడక మార్గం, మెట్ల మార్గం ద్వారా ఆలయానికి చేరుకున్నారు.

ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయగా, పోలీసులు, ఆలయ సిబ్బంది ట్రాఫిక్ నియంత్రణతో పాటు భక్తుల క్రమబద్ధీకరణలో నిమగ్నమయ్యారు. ధర్మ దర్శనం కోసం వచ్చిన భక్తులు ఓర్పుగా క్యూలో నిలబడి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు.

భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అదనపు బస్సులు ఏర్పాటు చేయడంతో పాటు తాగునీరు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచారు. స్వామివారి దర్శనం అనంతరం భక్తులు ప్రత్యేక పూజలు, అభి ఘనంగా జరుపుకుంటున్నారు. పాల్గొంటూ మహాశివరాత్రిని ఘనంగా జరుపుకుంటున్నారు: ఉమామహేశ్వరం ఆలయంలో భక్తుల పోటెత్తు – దర్శనానికి గంట సమయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *