ఈ సందర్భంగా ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వాటిపై కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల సంక్షేమానికి జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ సహకరిస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టీఎన్జీవో నాగర్కర్నూల్ యూనిట్ ప్రెసిడెంట్ సయ్యద్ నజీర్తో పాటు జిల్లా సంఘ సభ్యులు పాపిశెట్టి శీను, చెన్నకేశవ, కరీముల్లా, ఆనంద్, శివ రత్నమ్మ, అలివేలు, అమర్, స్కైలాబ్ తదితరులు పాల్గొన్నారు.
టీఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం విడుదల చేసే ఈ డైరీ ఉద్యోగులకు మార్గదర్శకంగా ఉపయోగపడుతుందని నాయకులు తెలిపారు. 2026 డైరీ ద్వారా ప్రభుత్వ నిబంధనలు, కార్యాచరణ వివరాలు ఉద్యోగులకు సులభంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.: TNGO 2026 డైరీ ఆవిష్కరణ

