హాల్ టికెట్లను పొందడానికి విద్యార్థులు https://www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి అవసరమైన వివరాలను నమోదు చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే సాంకేతిక సౌలభ్యం కోసం వాట్సాప్ సేవను కూడా అందుబాటులో ఉంచారు. విద్యార్థులు 8096958096 నంబర్‌కు “HI” అని మెసేజ్ పంపితే హాల్ టికెట్ పొందే అవకాశం ఉంటుంది.
ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5.28 లక్షల మంది విద్యార్థులు పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షలు మార్చి 14 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 16 వరకు కొనసాగనున్నాయి. విద్యార్థులు ముందుగానే హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షలకు సన్నద్ధం కావాలని అధికారులు సూచించారు.: రేపే టెన్త్ హాల్ టికెట్ల విడుదల – అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ అవకాశం
