Tag: Revenue Department

బెక్కేరలో రీ-సర్వే పనుల పరిశీలన..

కల్వకుర్తి మండలం బెక్కేర గ్రామంలో పైలెట్ ప్రాజెక్టులో భాగంగా జరుగుతున్న రీ-సర్వే పనులను అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. చెన్నయ్య పరిశీలించారు. రీ-సర్వేపై ప్రజల అపోహలను తొలగించి, భూ యజమానులకు పూర్తి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

భూ భారతి పోర్టల్‌పై పూర్తి అవగాహన పెంచుకోండి..

నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో రెవెన్యూ జూనియర్ అసిస్టెంట్లకు భూ భారతి పోర్టల్ నిర్వహణ, భూ రికార్డుల పారదర్శకత, ఆన్‌లైన్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్…

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పునరావాస కాలనీని పరిశీలించిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని అటవీ గ్రామాల ప్రజల కోసం బాచారం వద్ద నిర్మిస్తున్న స్వచ్ఛంద పునరావాస కాలనీని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పరిశీలించారు. అన్ని మౌలిక సదుపాయాలతో ఆదర్శ పునరావాస కేంద్రంగా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.