నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహంలో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పి. తరంగిణి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా పెద్ద ముద్దునూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ వాణి మాట్లాడుతూ విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపారు. హాస్టల్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకుంటే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని చెప్పారు. పరిశుభ్రత లేకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని విద్యార్థులకు సూచించారు.

రోజురోజుకు ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని, అందుకే విద్యార్థులు ఎక్కువగా మంచినీటిని తాగాలని సూచించారు. ఒంటిపూట బడులు ప్రారంభమైన తర్వాత అత్యవసరం అయితే తప్ప మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లకూడదని తెలిపారు.: విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి: వైద్యాధికారిణి డాక్టర్ వాణి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *