బిఆర్ఎస్ యువనేత డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి……. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మునిసిపల్ ఎన్నికల ప్రచారానికి వస్తున్న నేతలను నిలదీస్తూ మునిసిపల్ ఎన్నికలలో వారిని ఓడించి కారు గుర్తు అభ్యర్థులను గెలిపించాలని బిఆర్ఎస్ యువ నేత డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి కోరారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా అభ్యర్థి రపికా సుల్తానా తో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొని ప్రభుత్వ వైఫల్యాలను వివరించి గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. 6 గ్యారంటీల పేరుతో 420 హామీలను ప్రజలకు ఇచ్చి వాటిలో ఉచిత బస్సు పథకం మినహా ఏ ఒక్క పథకాన్ని అమలు చేయలేదని విమర్శించారు నాగర్ కర్నూల్ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అర్థం రవి సుభాష్ నాయకులు సత్యం హాసిం దామోదర్ చిట్టిబాబు తో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు: నిలదీయండి కాంగ్రెస్ ను ఓడించండి Post navigation కారును గెలిపిస్తేనే అభివృద్ధి… విజయం సాధించి హామీలు అమలు చేస్తాం