నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో తెలంగాణ అమర్నాథ్‌గా ప్రసిద్ధి చెందిన సలేశ్వరం జాతరకు మిషన్ భగీరథ ఆధ్వర్యంలో ఉచిత తాగునీటి సరఫరాకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా పౌర్ణమి సందర్భంగా మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరకు లక్షలాది మంది భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి తండోపతండాలుగా తరలివస్తున్నారు.

భక్తుల సౌకర్యార్థం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మిషన్ భగీరథ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జాతర ప్రాంతం అంతటా చెక్‌పోస్టుల వద్ద తాగునీటి ట్యాంకులను ఏర్పాటు చేసి, ట్యాంకర్ల ద్వారా నిరంతరంగా నీటి సరఫరా కొనసాగించేలా ప్రణాళికలు రూపొందించారు. జాతర ముగిసే వరకు భక్తులకు తాగునీటి కొరత లేకుండా తమ సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారని మిషన్ భగీరథ డీఈ హేమలత తెలిపారు.

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ ఏర్పాట్లు చేపట్టామని, భక్తులకు సౌకర్యవంతమైన వాతావరణంలో జాతర అనుభవం కల్పించడమే లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ హేమలతతో పాటు సీఈ లలిత, ఏఈలు మధు, సాయి, అక్బర్, సందీప్, హరినాథ్, అలాగే సిబ్బంది రాజేష్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.: సలేశ్వరం జాతరకు మిషన్ భగీరథ తాగునీటి సౌకర్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *