జిల్లా అదనపు (స్థానిక సంస్థల) కలెక్టర్ పి. అమరేందర్.
జిల్లా లోని ప్రతి గర్భవతి సురక్షిత మాతృత్వం పొందేలా వైద్య ఆరోగ్య సిబ్బంది కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ పి. అమరేందర్ అన్నారు. బుధవారం నాడు 99 రోజుల ఆరోగ్య మిషన్ కార్యక్రమం లో నిర్వహిస్తున్న ఆరోగ్య అవగాహన వారోత్సవంలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో గర్భవతులకు బాలింతలకు సురక్షిత మాతృత్వం పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని గౌరవ జిల్లా అదనపు కలెక్టర్ పి. అమరేందర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మహిళ ఆరోగ్యంగా ఉన్నప్పుడే
కుటుంబం,సమాజం బాగుంటుందని,మహిళా ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలియజేశారు. ముఖ్యంగా ప్రతి మహిళ విద్యావంతురాలు అయితే వైద్యులు ఆరోగ్య సిబ్బంది చెప్పిన విషయాలు పట్ల సంపూర్ణ అవగాహన కలుగుతుందని తద్వారా మహిళ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలుగుతుందని, మహిళలు గర్భం దాల్చడానికి ముందుగా మానసికంగా సంసిద్ధం కావాలని,రక్తహీనత నివారించడానికి స్థానికంగా లభించే పచ్చని ఆకుకూరలు, కాయగూరలు,పండ్లు, తృణధాన్యాలు తదితర పౌష్టికాహారం తీసుకోవాలని,వైద్యుల సూచనలు పాటించాలని, బిడ్డకు బిడ్డకు మధ్య కనీసం 3 సంవత్సరాల వ్యవధి,కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించాలని తెలియజేశారు.డి
ఎం.హెచ్.ఓ డాక్టర్ కే.రవికుమార్ నాయక్ మాట్లాడుతూ గర్భం దాల్చిన మహిళా 12 వారాల లోపు గ్రామం లోని ఎ.ఎన్.ఎం.దగ్గర నమోదు చేసుకోవాలని, ఐరన్ ఫోలిక్,క్యాల్షియం,బి.సి. మాత్రలు తప్పకుండా గర్భవతులు వేసుకోవాలన్నారు.ప్రతి గర్భవతి కచ్చితంగా గైనకాలజిస్ట్ డాక్టర్ చెకప్ లు చేయించుకుని వారి సూచనలు పాటించాలని, వారి సలహా మేరకు బర్త్ ప్లాన్ చేసుకోవాలని, సాధారణ ప్రసవం అయ్యేలా వ్యాయామాలు, పౌష్టికాహారం తెలుసుకోవాలని తెలియజేశారు. ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ టి. ఉషారాణి మాట్లాడుతూ
గర్భం దాల్చిన ప్రతి మహిళ కాన్పు తర్వాత తల్లి బిడ్డ క్షేమంగా (సురక్షిత మాతృత్వం) ఉండేలా ముందస్తుగా పరీక్షలు చేయించు కోవాలని,జిల్లా కేంద్ర ఆసుపత్రిలో సుశిక్షితులైన నర్సింగ్ సిబ్బంది,వైద్య నిపుణులు ఉన్నారని , వారి సూచనలు ప్రతి గర్భవతి పాటించాలని తద్వారా 90% సాధారణ ప్రసవాలు జరుగుతాయని తెలియజేశారు.
తదనంతరం స్త్రీ వైద్య నిపుణులు ప్రొఫెసర్లు డాక్టర్ నీలిమ,డాక్టర్ సుప్రియ గర్భవతులకు, బాలింతలకు తగిన సూచనలు సలహాలు తెలియజేశారు. ఆస్పత్రిలో ప్రతిరోజు 10 నుండి 15 ప్రసవాలు జరుగుతాయని నెలలో 430కు పైగా డెలివరీలు జరుగుతున్నట్లు తెలిపారు.తర్వాత జిల్లా అదనపు కలెక్టర్ గారి చేతుల మీదుగా సురక్షిత మాతృత్వ పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఆర్.ఎం.ఓ డాక్టర్ రవిశంకర్,డాక్టర్ ప్రశాంత్,ఆర్ఎంఓ ప్రోగ్రాం అధికారి డాక్టర్ లక్ష్మణ్, డాక్టర్ కవిత డాక్టర్ సాత్విక,జిల్లా మాస్ మీడియా అధికారి రాజగోపాలాచారి,నర్సింగ్ సూపరీoడెంట్లు శైలజ,హెల్త్ ఎడ్యుకేటర్ నరసింహ,ఓరుగంటి శ్రీనివాసులు,నర్సింగ్ అధికారులు ఆనంద్, రూప,సువేదా, ప్రసన్న, హెల్ప్ డెస్క్ ఇంచార్జ్ యాదగిరి,వివిధ గ్రామాల గర్భవతులు,బాలింతలు పాల్గొన్నారు.: ప్రతి గర్భవతి సురక్షిత మాతృత్వం పొందాలి…
