ఫిబ్రవరి 14, 2019లో జమ్మూకాశ్మీర్‌లోని Pulwama వద్ద జరిగిన ఉగ్రదాడిలో వీరమరణం పొందిన భారత అమరవీర జవాన్లను స్మరించుకుంటూ నాగర్‌కర్నూల్ మునిసిపాలిటీ పరిధిలోని నాగనూల్ గ్రామం (5వ వార్డు)లో శనివారం రాత్రి యువకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
చేతుల్లో కొవ్వొత్తులు పట్టుకుని గ్రామ వీధుల గుండా శాంతియుతంగా ర్యాలీ చేపట్టి అమర జవాన్లకు ఘన నివాళులర్పించారు. అనంతరం “జై జవాన్ – జై కిసాన్”, “భారత్ మాతాకీ జై” అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా Akhil Bharatiya Vidyarthi Parishad (ఏబీవీపీ) నాయకుడు ప్రసాద్ మాట్లాడుతూ —
2019 పుల్వామా దాడిలో అనేక మంది భారత జవాన్లు దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించారని, సైనికులు నిరంతరం దేశ భద్రత కోసం త్యాగాలు చేస్తున్నారని కొనియాడారు.
గ్రామ యువత జవాన్ల వీరమరణ గాధలను గ్రామస్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువకులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.: అమరవీర జవానులకు ఘన నివాళి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *