నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని పులిజాల–కార్వంగ గ్రామాల మధ్య ఉన్న వాగు కారణంగా రైతులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో పంటలను మార్కెట్‌కు తరలించడంలో పెద్ద అవరోధాలు ఏర్పడుతున్నాయి.
ఈ సమస్యపై గ్రామ ప్రజలు చేసిన వినతిని పరిగణలోకి తీసుకున్న నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే Dr. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి స్వయంగా ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. వాగు ప్రవాహం, రాకపోకల అంతరాయం, రైతుల ఇబ్బందులపై స్థానికులతో మాట్లాడి పూర్తి సమాచారం సేకరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… వాగుపై శాశ్వత బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని వెల్లడిస్తూ, అప్పటి వరకు గ్రామస్తులకు రాకపోకల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే రెండు గ్రామాల మధ్య సౌకర్యవంతమైన రవాణా ఏర్పడి, రైతులకు మార్కెట్‌కు పంటలు తరలించడం సులభమవుతుందని తెలిపారు. ప్రజల సమస్యలకు వెంటనే స్పందిస్తూ అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.: పులిజాల–కార్వంగ శాశ్వత బ్రిడ్జి నిర్మాణానికి హామీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *