నజీమా ఖాజా ఖాన్ గెలుపుతోనే అభివృద్ధి సాధ్యం. చైర్మన్ పదవిని కైవసం చేసుకుంటాం. ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి. నాగర్ కర్నూల్. మునిసిపాలిటీలోని 14వ వార్డు అభివృద్ధి చెందాలంటే ఓటర్లు హస్తం గుర్తుకు ఓటు వేసి నజీమా ఖాజా ఖాన్ ను గెలిపించాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి కోరారు ఆదివారం వార్డులో ఇంటింటి ప్రచారాన్ని అభ్యర్థితో కలిసి నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలలో పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడం జరిగిందని ప్రజల కనీస వసతులను కల్పించడం జరిగిందని వివరించారు. వందల కోట్లు నిధులతో విద్యా వైద్యం వ్యవసాయం ఉపాధి రంగాలపై దృష్టి సారించడంతోపాటు కాలనీలలో సీసీ రోడ్లను డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం జరిగిందని తెలిపారు. ప్రజా పాలన అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తుందని అన్నారు. ఇతర పార్టీల కల్లబొల్లి మాటలు నమ్మకుండా అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరు హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. రెండు సంవత్సరాలుగా ప్రజలు స్వేచ్ఛగా జీవనం సాగిస్తున్నారని అరాచకం లేకుండా అభివృద్ధి లక్ష్యంగా రాజకీయాలకు అతీతంగా అన్ని పథకాలను అందించడం జరిగిందని తెలిపారు. త్వరలోనే ముస్లింల షాదీఖానాకు శంకుస్థాపన చేస్తామని మైనార్టీల సంక్షేమానికి నిరంతరం ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో ఖాజా ఖాన్ తో పాటు యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి వినోద్ తో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు: నజీమా కాజాఖాన్ గేలుపుతూనే అభివృద్ధి సాధ్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *