వేదమంత్రాల నడుమ శ్రీసార్థాసప్త జేష్టమాత సమేత శనేశ్వర స్వామికి విశేష పూజలు, అభిషేకాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి మాట్లాడుతూ, ఈ మాసంలో స్వామివారిని భక్తితో పూజిస్తే విశేష ఫలితాలు లభిస్తాయని తెలిపారు. జన్మ రీత్యా, గోచార రీత్యా శనిగ్రహ దోష నివారణకు ప్రతి ఒక్కరు శక్తిమేరకు పూజలు చేయాలని సూచించారు.
అదేవిధంగా ఆలయంలో గోన బుద్ధారెడ్డి కాలంనాటి బ్రహ్మసూత్రంతో ఉన్న పరమశివునికి రుద్రాభిషేకాలు, అర్చనలు, దీపారాధనలు నిర్వహించగా, నందీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెల్దండ గోపాల్ రావు, సర్పంచ్ టి. సుగుణమ్మ, కమిటీ సభ్యులు మరియు గ్రామ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.: నంది వడ్డేమాన్‌లో శనేశ్వర స్వామికి తిలతైల అభిషేకాలు




