నాగర్ కర్నూల్ జిల్లా ఉద్యోగులు, పెన్షనర్లకు ఆరోగ్య పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ నాగర్కర్నూల్ జిల్లా టీఎన్జీవో సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో Revanth Reddy నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలు, ఉద్యోగులకు కోటి రూపాయల బీమా సదుపాయం, వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల జీతాలను 010 పద్దు ద్వారా చెల్లించడం, ప్రత్యేక డైరెక్టరేట్ మంజూరు వంటి ఉద్యోగ అనుకూల నిర్ణయాలు తీసుకున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా టీఎన్జీవో అధ్యక్షులు మరియు ఉద్యోగ జేఏసీ చైర్మన్ బావండ్ల వెంకటేష్, జిల్లా కార్యదర్శి ఎండి షర్ఫుద్దీన్ మాట్లాడుతూ… దీర్ఘకాలంగా వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఈ ఆరోగ్య పథకం ఎంతో ఊరటనిస్తుందని అన్నారు. భవిష్యత్తులో 51% ఫిట్మెంట్తో 2023 జూలై 1 నుంచి పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏలు మంజూరు, పెండింగ్ బిల్లుల బకాయిలు జమ వంటి అంశాలను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.నాగర్కర్నూల్ జిల్లా టీఎన్జీవో సంఘం పక్షాన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో టీఎన్జీవో నాయకులు వై. బాలరాజ్, పున్నారెడ్డి, రాజ్ కుమార్, రాములు, రెడ్డి రామ్, మధుసూదన్ రెడ్డి, సురేష్ కుమార్, కళ్యాణ్ కృష్ణారావు, చెన్నకేశవులు, యాదగిరి, కృష్ణయ్య, కొట్ర బాలాజీ, అరుణ, శివరత్నమ్మ, లక్ష్మీ కుమారి, రాజవర్ధన్ రెడ్డి, సంఘ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.: ఉద్యోగులు–పెన్షనర్లకు ఆరోగ్య పథకం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *