ముందుగా డాక్టర్లు, వైద్య సిబ్బంది విధులకు సక్రమంగా హాజరవుతున్నారా అనే విషయాన్ని తెలుసుకునేందుకు హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో కలెక్టర్ మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, అందుతున్న వైద్య సేవల గురించి వివరాలు తెలుసుకున్నారు. రోజువారీ అవుట్పేషెంట్ సంఖ్యపై కూడా సమాచారం సేకరించారు.
రోగుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని, వారికి చేసిన పరీక్షలు, అందించిన చికిత్స, ఇచ్చిన మందుల వివరాలను సక్రమంగా నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ఆసుపత్రిలోని ల్యాబ్, మెడికల్ స్టోర్, లేబర్ రూమ్ను కూడా పరిశీలించి, నెలలో జరిగిన ప్రసవాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.మెడికల్ స్టోర్లో మందులను క్రమబద్ధంగా ఉంచాలని, అవసరమైన ర్యాకులు ఏర్పాటు చేయాలని డీఎంహెచ్ఎను ఆదేశించారు. రోగులకు ఎప్పుడూ అందుబాటులో ఉండి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లు, సిబ్బందికి సూచించారు.
ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఎ డాక్టర్ రవికుమార్, ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు.: తెలకపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ…




