నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఫిర్యాదుదారుల నుండి మొత్తం 9 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా వచ్చిన ఫిర్యాదులను శ్రద్ధగా విని, వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత పోలీస్ అధికారులకు సూచనలు చేశారు.

ఈ రోజు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుల్లో భూమికి సంబంధించినవి 2, తగు న్యాయం కోరుతూ వచ్చినవి 5, కుటుంబ తగాదాలకు సంబంధించినవి 2 ఉన్నాయి. ఈ అర్జీలపై వెంటనే చర్యలు తీసుకునేలా సంబంధిత పోలీస్ స్టేషన్‌ల ఎస్‌ఐలు, సి.ఐలతో ఫోన్ ద్వారా మాట్లాడి సమస్యల పరిష్కారానికి సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ సంగ్రామ్ సింగ్ మాట్లాడుతూ ప్రజలు నిర్భయంగా, ఎలాంటి పైరవీలు లేకుండా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా చట్టబద్ధంగా సమస్యలను పరిష్కరించుకునేలా పోలీస్ శాఖ కృషి చేస్తుందని తెలిపారు.

పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా పనిచేస్తూ శాంతి భద్రతలను కాపాడడం తమ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.: ప్రజావాణిలో 9 ఫిర్యాదులు స్వీకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *