నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో పుల్వామా దాడి సందర్భంగా అమర జవాన్లకు ఘనంగా నివాళులు అర్పించారు. యువకులు చేతుల్లో కొవ్వొత్తులు పట్టుకుని అంబేద్కర్ చౌరస్తా వరకు శాంతియుత క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.

దేశభక్తి నినాదాలతో జిల్లా కేంద్రం మార్మోగింది. ర్యాలీ అనంతరం అమరుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి రెండు నిమిషాల మౌనం పాటించారు.

పుల్వామా దాడిలో దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల త్యాగం వృథా కావద్దని యువత ప్రతిజ్ఞ చేశారు. జవాన్ల ధైర్యసాహసాలను స్మరించుకుంటూ దేశభక్తిని చాటారు.

ఈ కార్యక్రమంలో స్థానిక యువజన సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.: నాగర్ కర్నూల్‌లో పుల్వామా అమర జవాన్లకు ఘన నివాళి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *