నాగర్ కర్నూల్ జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 50 ఫిర్యాదులు స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయంతో కలిసి ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి ద్వారా అందుతున్న వినతులను జాప్యం లేకుండా పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రతి శాఖకు సంబంధించిన దరఖాస్తులను సంబంధిత అధికారులు తక్షణమే పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. దరఖాస్తుదారులకు పరిష్కారం గురించి స్పష్టమైన సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులదేనని పేర్కొన్నారు.

ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన వినతులపై చేపట్టిన చర్యలను ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని, అర్జీలను పెండింగ్లో ఉంచకుండా నిరంతరం సమీక్షించాలన్నారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్, వివిధ విభాగాల సూపరిండెంట్లు, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు: ప్రజావాణి కార్యక్రమంలో 50 ఫిర్యాదులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *