సంతానం కలిగి అర్హత గల దంపతులలో పురుషులకు శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతిగా నో స్కాల్పెల్ వ్యాసెక్టమీ విధానంలో ఈ ఆపరేషన్లు నిర్వహించబడతాయి. సుశిక్షిత వైద్యుల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ కేవలం 5 నుంచి 10 నిమిషాల్లో పూర్తవుతుందని తెలిపారు. ముందుగా అవసరమైన సాధారణ మరియు రక్త పరీక్షలు నిర్వహించి, ఆపరేషన్ అనంతరం మందులు ఇచ్చి వెంటనే డిశ్చార్జ్ చేస్తారని పేర్కొన్నారు.
ఈ శిబిరానికి వచ్చే వారు తమ ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా పుస్తకం జిరాక్స్ కాపీలు తీసుకురావాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం ఆసుపత్రి హెల్ప్ డెస్క్ ఇంచార్జ్ టి. యాదగిరిని లేదా 9014932408, 9989221518 నంబర్లను సంప్రదించవచ్చు.
శిబిరంలో ఆపరేషన్ చేయించుకునే వారికి ప్రోత్సాహకంగా ఒక్కొక్కరికి రూ. 1000 నగదు అందజేయనున్నట్లు డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భరత్ కుమార్ రెడ్డి తెలిపారు.: నాగర్ కర్నూల్‌లో 15న కోతకుట్టులేని వ్యాసెక్టమీ శిబిరం


