నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన గిరిజన బాల, బాలికల కోసం 2026-27 విద్యా సంవత్సరానికి గాను మోడల్ స్పోర్ట్స్ పాఠశాలలు మరియు వాటర్ స్పోర్ట్స్ అకాడమీలలో 5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి శ్రీ యం. ఫిరంగి తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రవేశ ప్రక్రియ నిర్వహించబడుతుంది.

అభ్యర్థులు 31-08-2026 నాటికి 9 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఎంపిక ప్రక్రియలో భాగంగా ఎత్తు, బరువు, స్టాండింగ్ బ్రాడ్ జంప్, సర్జికల్ జంప్, మెడిసిన్ బాల్ త్రో, 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్, ఫ్లెక్సిబిలిటీ, 800 మీటర్ల పరుగు వంటి క్రీడా పరీక్షలు నిర్వహించబడతాయి. జిల్లా స్థాయిలో ఎంపికైన 10 మంది బాలురు, 10 మంది బాలికలను రాష్ట్ర స్థాయి ఎంపికలకు పంపించనున్నారు.జిల్లా స్థాయి ఎంపికలు 11-03-2026 ఉదయం 9 గంటలకు కల్వకుర్తి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో నిర్వహించబడతాయి. ఆసక్తి గల ప్రస్తుత 2025-26 విద్యా సంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థులు కుల ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ (గ్రామీణ రూ.1,50,000/-లోపు, పట్టణ రూ.2,00,000/- లోపు), రెండు పాస్పోర్ట్ ఫోటోలు, బోనఫైడ్, ఆధార్ జిరాక్స్ 09-03-2026 సాయంత్రం 5 గంటలలోగా జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయం, IDOC, నాగర్ కర్నూల్లో దరఖాస్తులు సమర్పించాలి.: మోడల్ స్పోర్ట్స్ / వాటర్ స్పోర్ట్స్ అకాడమీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *