ఈ సందర్భంగా విద్యార్థులు DEO నుంచి MEO వరకు వివిధ పాత్రలను పోషించారు. వెంకట అరుగాంచల్ DEO-MEOగా, రిషిత గాడ్ Dy.EOగా, తౌఫిక్ అహ్మద్, రితిక్ గాడ్ ప్రిన్సిపల్గా వ్యవహరించగా, ఆర్. మోక్షితతో పాటు ఇతర విద్యార్థులు వివిధ సబ్జెక్టుల టీచర్లుగా బాధ్యతలు స్వీకరించారు. మిగిలిన విద్యార్థులు కూడా తమకు కేటాయించిన విధులను నిబద్ధతతో నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
పిల్లలు స్వయంగా పరిపాలనా విధులను నిర్వహించడం ద్వారా నాయకత్వ లక్షణాలు, బాధ్యతా భావం, సమన్వయం వంటి విలువలను నేర్చుకున్నారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిందని ఉపాధ్యాయులు తెలిపారు.స్వయం పరిపాలన దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన విద్యార్థులను స్కూల్ కరస్పాండెంట్ (డైరెక్టర్) కృష్ణారెడ్డి, శేఖర్, రమేష్ రావు, సురేందర్ రెడ్డి అలాగే స్కూల్ ప్రిన్సిపల్ రాఘవేందర్ గౌడ్ అభినందించారు. భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థుల్లో నాయకత్వ నైపుణ్యాలను పెంపొందిస్తామని వారు తెలిపారు.: న్యూ గీతం ప్రైమరీ స్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం
