నాగర్కర్నూల్ జిల్లాలో కొనసాగుతున్న వివిధ సాగునీటి ప్రాజెక్టుల కారణంగా ముంపునకు గురవుతున్న గ్రామాల ప్రజలకు న్యాయమైన పరిహారం అందించడంతో పాటు భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్ అండ్ ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధ్యక్షతన బుధవారం నాగర్కర్నూల్ జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ సూచనలు చేశారు.

ఈ సమావేశంలో ప్రాజెక్టుల పరిధిలో భూసేకరణ పురోగతి, నిర్వాసితులకు పరిహారం చెల్లింపుల స్థితి, ఆర్ అండ్ ఆర్ కాలనీల నిర్మాణ పనులు, మౌలిక వసతుల కల్పన అంశాలపై సమగ్రంగా చర్చించారు. అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని మర్లపాడు, కేశవతాండ గ్రామాల ప్రజల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేలా తక్షణ చర్యలు చేపట్టాలని కమిషనర్ స్పష్టం చేశారు.: భూసేకరణ వేగవంతం చేయాలి

భూసేకరణలో సాంకేతిక సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించి అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తిస్థాయి పరిహారం అందించాలని అధికారులకు ఆదేశించారు. అలాగే ఆర్ అండ్ ఆర్ కాలనీల్లో రహదారులు, తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, పాఠశాలలు, ఆంగన్వాడీ కేంద్రాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.పరిహారం చెల్లింపులు పారదర్శకంగా లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేయాలని, పెండింగ్ కేసులను ప్రత్యేక దృష్టితో పరిష్కరించాలని తెలిపారు. ప్రతి వారం పురోగతిని సమీక్షిస్తూ పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అమరేందర్తో పాటు రెవెన్యూ, ఇరిగేషన్, నేషనల్ హైవే శాఖ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *