తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నివాసంలో పెద్దఎత్తున కార్యకర్తలు, నాయకులు హాజరై కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం నాగర్కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ గారు చేసిన పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు. అభివృద్ధి అంటేనే కేసీఆర్ అని, తెలంగాణ ప్రజలకు అద్భుతమైన పాలన అందించారని తెలిపారు. కార్యకర్తలకు ఎలాంటి ఆపద వచ్చినా పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.

కేసీఆర్ గారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు మరువలేనివని, కొంతమంది నాయకులు ఆయన పేరును లేకుండా చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నా, కేసీఆర్ గారే తెలంగాణకు శ్రీరామ రక్ష అని స్పష్టం చేశారు.: ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు – జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ

ఈ కార్యక్రమంలో నాగర్కర్నూల్ పట్టణ కౌన్సిలర్లు తిమ్మాజీపేట పాండు, కొత్త గంగాధర్, అర్జునయ్య, జయప్రకాష్ చారి, జయలక్ష్మి నగేష్, మాజీ జడ్పీటీసీ శ్రీశైలం, అలాగే పార్టీ నాయకులు అర్థం రవి, భాస్కర్ గౌడ్, చంద్రశేఖర్ రెడ్డి, మాధవ రెడ్డి, కేశవులు గౌడ్, ఆనంద్ గౌడ్, యోగానంద రెడ్డి, నర్సింహ రెడ్డి, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.↓

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *