నాగర్‌కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని నాగర్‌కర్నూల్ మండల కేంద్రంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెల్కపల్లి మండలానికి చెందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే Dr. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గారు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు ప్రభుత్వ సహాయానికి కృతజ్ఞతలు తెలుపుతూ, తమ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు… ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి అర్హ కుటుంబానికి సంక్షేమ పథకాలు చేరేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. అలాగే రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, మండల స్థాయి నాయకులు, ప్రభుత్వ అధికారులు, గ్రామస్తులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. మహిళా సాధికారతకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయని ఎమ్మెల్యే తెలిపారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా నిరంతరం కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *