ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన గౌడ కులస్తుల కౌన్సిలర్లకు ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జై గౌడ ఉద్యమ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జై గౌడ ఉద్యమ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గుండ్రాతి నారాయణ గౌడ్ హాజరై కౌన్సిలర్లను శాలువాలు, పూలమాలలతో సత్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌడ కులస్తులు అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పిలుపునిచ్చారు. జై గౌడ ఉద్యమ నాగర్ కర్నూల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు సోమ ప్రగతి గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో ప్రతి గౌడ కులస్తుడు రాజకీయ, ఆర్థిక, ఉద్యోగ సంక్షేమ విభాగాల్లో ముందుండాలని కోరారు.

నూతనంగా ఎన్నికైన 19వ వార్డు కౌన్సిలర్ కాటా గౌని సునీత శ్రీనివాస్ గౌడ్, మూడో వార్డు కౌన్సిలర్ వసంత సంతోష్ గౌడ్, 9వ వార్డు కౌన్సిలర్లు సుంకరి అలివేల, రాజేష్ గౌడ్లను ప్రత్యేకంగా సన్మానించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవాభావంతో పనిచేయాలని నూతన కౌన్సిలర్లను నాయకులు కోరారు.ఈ కార్యక్రమంలో జై గౌడ ఉద్యమ యూత్ అధ్యక్షులు కటగౌని హరీష్ గౌడ్తో పాటు ప్రసాద్ గౌడ్, సింగారి జ్యోతి గౌడ్, పలుస నిర్మల గౌడ్, గుండ్రాతి సత్యం గౌడ్, మహిళా నాయకులు, సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.: గౌడ కౌన్సిలర్లకు ఘన సన్మానం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *