ఈనెల 13న ఎండబెట్ల గ్రామంలో అనంత శ్రీ గోశాల ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే గో వృషభ కళ్యాణం మరియు గోదాన కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక ను నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఈ నెల 13వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మదన్మోహన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్‌లో ఉన్న ఆర్ట్స్ కళాశాలలో ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల మరియు ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ మెగా జాబ్ మేళాలో దాదాపు 10 ప్రముఖ కంపెనీలు పాల్గొని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ అభ్యర్థులతో పాటు ప్రస్తుతం ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు కూడా ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల సమక్షంలో మెగా జాబ్ మేళాకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఆసక్తి గల నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
మరిన్ని వివరాలకు జేకేసి ఇంచార్జి రామకృష్ణను 89857 47301 నంబర్‌లో సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సమన్వయకర్త అంజయ్య, కళాశాల అధ్యాపకులు ప్రసాద్, అధ్యాపక బృందం మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.: నాగర్ కర్నూల్‌లో 13న మెగా జాబ్ మేళా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *