యాప్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లాలో 68,855 మంది రైతులు సుమారు 3.63 లక్షల యూరియా బస్తాలను కొనుగోలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవడం వల్ల రైతులకు ఎరువుల లభ్యతపై స్పష్టత ఉండటంతో పాటు పంపిణీ ప్రక్రియ సులభంగా జరుగుతుందని తెలిపారు.
రైతులు తమ అవసరానికి అనుగుణంగా ముందుగానే యూరియా యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది. జిల్లాలో ఎరువుల సరఫరా పై అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.: నాగర్ కర్నూల్ జిల్లాలో 637 టన్నుల యూరియా నిల్వలు
