అదేవిధంగా జన్మదిన వేడుకల సందర్భంగా రోడ్డును బ్లాక్ చేసి ప్రజా రవాణాకు తీవ్ర అంతరాయం కలిగించిన విష్ణు, నరసింహ, శ్రీశైలం, భాస్కర్ గౌడ్, తిమ్మాజీపేట పాండు, ఇంద్రకల్ రమణ తదితరులపై కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ ఘటనల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం. ప్రజా ఆస్తులకు నష్టం కలిగించడం, ట్రాఫిక్‌కు ఆటంకం కల్పించడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని పోలీసులు హెచ్చరించారు.
ఈ విషయాన్ని నాగర్ కర్నూల్ ఎస్ఐపీ కే. గోవర్ధన్ వెల్లడించారు.: మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో కేసు నమోదు



