నాగర్కర్నూల్ జిల్లా మన్నెవారిపల్లి ఎస్ఎల్బీసీ అవుట్లెట్ వద్ద శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) టన్నల్ పనులు ఏడాది విరామం తర్వాత తిరిగి ప్రారంభమయ్యాయి. గత ఏడాది ఫిబ్రవరి 22న బ్రహ్మగిరి ప్రాంతంలో జరిగిన ప్రకృతి విపత్తులో 14వ కిలోమీటర్ వద్ద ఎనిమిది మంది కార్మికులు సజీవ సమాధి కావడంతో పనులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అప్పట్లో సుమారు 40 రోజుల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్లో ఇద్దరు ఇంజనీర్ల మృతదేహాలు మాత్రమే వెలికితీయగలిగారు.

నవంబర్ 3న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన్నెవారిపల్లి ఎస్ఎల్బీసీ అవుట్లెట్ను సందర్శించగా, అనంతరం ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో నిపుణులతో సమాలోచనలు నిర్వహించారు. హెలికాప్టర్ ద్వారా అత్యాధునిక ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సర్వే చేపట్టి మొత్తం 44 కిలోమీటర్ల పరిధిలో సమగ్ర పరిశీలన పూర్తి చేశారు. మాజీ ఆర్మీ అధికారి హర్పాల్ సింగ్, నిపుణుడు పరిక్షిత్ మెహ్రా సలహాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ మెథడ్ (ATM) ద్వారా బ్లాస్టింగ్ చేపడుతున్నారు.: SLBC టన్నల్ పనులు పునఃప్రారంభం

మొత్తం టన్నల్ పొడవు 43.931 కి.మీ కాగా ఇప్పటివరకు సుమారు 34 కి.మీ పనులు పూర్తయ్యాయి. మిగిలిన 9.53 కి.మీ పనులను అదానీ గ్రూప్ చేపట్టినట్లు సమాచారం. మట్టి, రాళ్ల తరలింపుకు కన్వేయర్ బెల్ట్కు బదులుగా ట్రైన్ బాక్సులు వినియోగించనున్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు కార్మికులు, నిపుణులు పనుల్లో నిమగ్నమవుతుండగా, మూడు రోజులుగా బ్లాస్టింగ్ జరిగినప్పటికీ మట్టి తొలగింపు ఇంకా ప్రారంభం కాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *