నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం మామిళ్ళపల్లి గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వైభవంగా నిర్వహించిన స్వామివారి కళ్యాణోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల సరిత రాజేష్ రెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య జరిగిన కళ్యాణోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో వీక్షించి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.

ఎమ్మెల్యే మాట్లాడుతూ మామిళ్ళపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రాంత ప్రజల ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి, ఐక్యతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. దేవాలయ అభివృద్ధి, సౌకర్యాల విస్తరణకు అవసరమైన సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.: మామిళ్ళపల్లి లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవంలో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *