ఆరోపణల ప్రకారం, ఓ మహిళ కార్యాలయానికి వెళ్లిన సమయంలో మేనేజర్ అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ విజయ్ కుమార్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సంఘటనపై స్పందించిన జియో యాజమాన్యం, సంబంధిత అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఉద్యోగం నుంచి తొలగిస్తామని హామీ ఇచ్చినట్లు నాయకులు వెల్లడించారు.
బీసీ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ మహిళలపై ఇలాంటి ప్రవర్తన అసహ్యకరమని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు అవసరమని పేర్కొన్నారు. యాజమాన్యం హామీ మేరకు తొలగింపు ప్రక్రియ చేపడతారని సమాచారం.: జియో కార్యాలయ మేనేజర్‌పై అసభ్య ప్రవర్తన ఆరోపణలు

