పర్యటన సందర్భంగా గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. మౌలిక సదుపాయాల పనులను ప్రత్యక్షంగా పరిశీలించిన ఓఎస్ఓ సంబంధిత అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే పరిష్కరించగల అంశాలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు స్థితిగతులపై వివరాలు తెలుసుకుని, లబ్ధిదారులతో ముచ్చటించారు.: మద్దిమడుగులో సీఎం ఓఎస్‌డీ పర్యటన
మద్దిమడుగు గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పర్యటనతో గ్రామంలో అభివృద్ధి పనులకు మరింత ఊపునిస్తుందని స్థానికులు అభిప్రాయపడ్డారు.
