తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో క్షేత్రస్థాయిలో సేవలందిస్తున్న ఆశా కార్యకర్తలకు యూనిఫామ్ వస్త్రాల పంపిణీ కార్యక్రమం బుధవారం లట్టుపల్లిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లట్టుపల్లి వైద్యాధికారి డాక్టర్ టి. ప్రసన్న ఆశా కార్యకర్తలకు యూనిఫామ్ చీరలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆశా కార్యకర్తల సేవలను గుర్తిస్తూ ప్రతి సంవత్సరం వారికి రెండు చొప్పున యూనిఫామ్ చీరలను అందజేస్తుందని తెలిపారు. ఆశా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య పని చేసే సమయంలో యూనిఫామ్ ధరిస్తే వారు ఆశా కార్యకర్తలని ప్రజలు సులభంగా గుర్తించి అవసరమైన ఆరోగ్య సేవలను పొందేందుకు సౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నారు.

లట్టుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో మొత్తం 22 మంది ఆశా కార్యకర్తలు పనిచేస్తున్నారని, వారికి బుధవారం ప్రతి ఆశా కార్యకర్తకు రెండు చొప్పున మొత్తం 44 చీరలను పంపిణీ చేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆశా నోడల్ పర్సన్ బాలమణి, హోమియో వైద్యులు డాక్టర్ మేఘనా రెడ్డి, ఆరోగ్య సిబ్బంది శశికళ, వరలక్ష్మి, బొజ్జమ్మ, విజయలక్ష్మి, జ్యోతి, జకియా, నగేష్, సుమిత్ర, స్వరూప రాణి, చంద్రశేఖర్ పాల్గొన్నారు. అలాగే లట్టుపల్లి, మంగనూర్, గంగారం, ఎర్రకుంట తండా ఆరోగ్య ఉప కేంద్రాల పరిధిలోని ఆశా కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.: లట్టుపల్లిలో ఆశా కార్యకర్తలకు యూనిఫామ్ చీరల పంపిణీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *