నాగర్ కర్నూల్ మండలం కుమ్మెర గ్రామంలో శ్రీ మల్లన్న స్వామి దేవాలయ జాతర సందర్భంగా 18-02-2026న జరిగిన ఘర్షణ ఘటనలు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. క్యూ నిర్వహణ విషయంలో మొదలైన వాగ్వాదం దాడుల వరకు వెళ్లడంతో పరస్పర ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ ఘటనలకు సంబంధించి నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్‌లో మొత్తం నాలుగు కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మొదటి ఘటనలో శ్రీనివాస్ రెడ్డిపై రాయి దాడి జరిగినట్లు ఫిర్యాదు రావడంతో Cr.No.53/2026 నమోదు చేశారు. అదే రోజు మరో వర్గం నుంచి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా కోర్టు అనుమతితో Cr.No.66/2026 కేసు తీసుకున్నారు.
ఇదిలా ఉండగా 21-02-2026న చిలికేశ్వరం మౌనికకు చెందిన రెండు నెలల శిశువు అనుమానాస్పదంగా మృతి చెందడంతో Cr.No.60/2026 కింద కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం షార్ట్ ఒపీనియన్ ప్రకారం శరీరంపై ఎలాంటి యాంటీమార్టం గాయాలు లేవని, తుది మరణ కారణం FSL హిస్టోపాథాలజీ నివేదిక అనంతరం వెల్లడిస్తామని వైద్యులు తెలిపారు.
తదుపరి మౌనిక ఇచ్చిన అదనపు ప్రకటన ఆధారంగా దాడి సమయంలో శిశువుకు గాయమై మృతి చెందినట్లు ఆరోపణలు రావడంతో Cr.No.61/2026 నమోదు చేసి BNS సెక్షన్లతో పాటు SC/ST అట్రాసిటీ చట్టం వర్తింపజేశారు.
ఈ కేసుల్లో ప్రధాన నిందితులుగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డిలను 23-02-2026న అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరచగా న్యాయ హిరాసత్‌కు పంపారు. మిగతా ఆరుగురు నిందితులు పరారీలో ఉండగా ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి.
జిల్లా ఎస్పీ స్థాయి అధికారులు గ్రామాన్ని సందర్శించి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కుల ధృవీకరణ అంశంపై ఎంఆర్ఓ కార్యాలయానికి నివేదిక పంపగా అధికారిక సమాచారం కోసం వేచి చూస్తున్నారు. కేసులపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతుందని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీస్ శాఖ స్పష్టం చేసింది.

నమోదు చేసిన కేసులు – సెక్షన్లు (Serial Wise)
1️⃣ Cr. No. 53/2026
👉 u/s 118(1), 352 r/w 3(5) BNS
2️⃣ Cr. No. 66/2026
👉 u/s 115(2), 352 r/w 3(5) BNS
3️⃣ Cr. No. 60/2026 (శిశు మృతి)
👉 u/s 194 BNSS
4️⃣ Cr. No. 61/2026 (అదనపు ఆరోపణలు)
👉 u/s 115(2), 109(1), 352, 351(2) r/w 3(5) BNS
SC/ST (POA) Act: 3(1)(r), 3(1)(s), 3(2)(v)

👤 అరెస్ట్ అయిన నిందితులు
A1 – శ్రీనివాస్ రెడ్డి
A2 – మధుసూదన్ రెడ్డి
A3 – శ్రీకాంత్ రెడ్డి
➡️ ముగ్గురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయ హిరాసత్‌కు పంపించారు.

🚨 పరారీలో ఉన్న నిందితులు
A4 – విష్ణువర్ధన్ రెడ్డి
A5 – కన్నీ రెడ్డి
A6 – కటికె నరేష్
A7 – తుకారం రెడ్డి
A8 – సతీష్ రెడ్డి
A9 – మాధవ్ రెడ్డి
➡️ వీరి పట్టుకోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు చేపట్టాయి.






















: కుమ్మెర గ్రామ జాతర ఘటనపై మూడు కేసులు నమోదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *