కేటీఆర్ పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బీఆర్ఎస్ నాయకులు వెల్లడించారు. పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఇప్పటికే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది.
ఇక కేటీఆర్ రాక నేపథ్యంలో కుమ్మెర గ్రామంలో పోలీసు శాఖ భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేసింది. జిల్లావ్యాప్తంగా రాజకీయ వాతావరణం ఉత్కంఠభరితంగా మారింది. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు.: కుమ్మెర ఘటనపై బీఆర్ఎస్ స్పందన
