సమావేశంలో ముఖ్యంగా పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (PRLIS) పనుల పురోగతిపై సమీక్ష జరిగింది. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి పాలమూరు ప్రాంతానికి సాగునీరు అందించే ప్రాజెక్టును వేగవంతం చేయాలని ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డి అధికారులను కోరారు. రైతులకు సాగునీటి సదుపాయం కల్పించేందుకు ఈ ప్రాజెక్టు ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి సంబంధించి సుమారు రూ.5,000 కోట్ల పనులపై సమావేశంలో చర్చించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలోపు పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.
వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్ నుంచి ఆయకట్టు కాలువల పనులను వెంటనే ప్రారంభించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే సుమారు 1.33 లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందని చెప్పారు. దీంతో వేల ఎకరాల భూమి సాగులోకి వచ్చి రైతులకు భారీ లాభం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. పాలమూరు ప్రాంత అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు.: ఎర్రమంజిల్ జలసౌధలో సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష సమావేశం




