ఈ సందర్భంగా ఆరోగ్య రంగంలో విశేష సేవలు అందిస్తున్న మహిళా సిబ్బందిని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. పి.పి యూనిట్ వైద్య అధికారి డా. సృజనకు ఘన సన్మానం నిర్వహించారు. అలాగే నర్సింగ్ అధికారి వనితను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా శాలువాతో సత్కరించారు.
ఆరోగ్య సేవల్లో అంకితభావంతో పనిచేస్తున్న ఆశా కార్యకర్త లక్ష్మీ సేవలను ప్రశంసిస్తూ ఆమెను కూడా సన్మానించారు. అదేవిధంగా జిల్లాలో సేవలందిస్తున్న ఆశా కార్యకర్తలకు జిల్లా కలెక్టర్ చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బడవత్ సంతోష్ మాట్లాడుతూ ఆరోగ్య రంగంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య సంరక్షణలో ఆశా కార్యకర్తలు ఎంతో ముఖ్యమైన బాధ్యత నిర్వర్తిస్తున్నారని అన్నారు.
కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను, ముఖ్యంగా డీఎంహెచ్‌వో డా. రవి కుమార్ నాయక్‌ను కలెక్టర్ అభినందించారు.: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు
