ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతదేశ బహుజనుల రాజకీయ దిశను మార్చిన గొప్ప నాయకుడు మాన్యవర్ కాన్షిరాం అని కొనియాడారు. ఉత్తర్ ప్రదేశ్‌లో బీఎస్పీ పార్టీని బలోపేతం చేసి నాలుగు సార్లు అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఆయనదేనని పేర్కొన్నారు. బహుజన సమాజానికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని తెలిపారు.
కాన్షిరాం జయంతి సభను విజయవంతం చేసేందుకు జిల్లాలోని బహుజనులు భారీగా తరలివచ్చి పాల్గొనాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.: ఛలో బడంగ్‌పేట్
