సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ వి. శేఖర్, జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. రవికుమార్ నాయక్ పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లను అందజేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వైద్యాధికారులు మాట్లాడుతూ నర్సింగ్ కళాశాల విద్యార్థులు విద్యతో పాటు సేవా భావాన్ని కూడా అలవర్చుకోవడం చాలా మంచి విషయమని పేర్కొన్నారు. రోగులకు సేవ చేయడం ద్వారా మానవతా విలువలు పెంపొందుతాయని అన్నారు.
ఆసుపత్రిలోని పలు వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేయడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు, ఆసుపత్రి నర్సింగ్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.: నాగర్‌కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ

