గో సేవ, గో సంరక్షణ ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. గ్రామ ప్రజల భాగస్వామ్యంతో సంప్రదాయబద్ధంగా గో వృషభ కళ్యాణం నిర్వహించడంతో పాటు గోదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నట్లు వారు వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి మాట్లాడుతూ గో సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తాయని అన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక మరియు సామాజిక కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమానికి హాజరై ఆశీర్వదిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి గ్రామ ప్రజలందరూ సహకరించాలని ట్రస్ట్ నిర్వాహకులు కోరారు.: ఎండబెట్ల గ్రామంలో గో వృషభ కళ్యాణం
