గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున హాజరై పండుగను ఆధ్యాత్మిక వాతావరణంలో జరుపుకున్నారు. ఎల్లమ్మ మల్లయ్య దేవతలకు ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పించి, సంప్రదాయ కార్యక్రమాలను నిర్వహించారు. పట్నం కార్యక్రమం సందర్భంగా గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి భక్తులతో కలిసి దేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి మరియు ప్రజల శ్రేయస్సు కోసం తన వంతు కృషి కొనసాగిస్తానని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు: మంతటి గ్రామంలో ఎల్లమ్మ మల్లయ్య పెద్ద పట్నం




