ఈ ఘటనలో పాలుపంచుకున్న నిందితులను వెంటనే అరెస్ట్ చేసి చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. వైద్యులపై దాడులు జరగడం ఆందోళనకరమని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
దాడికి పాల్పడిన వారిపై తక్షణ చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. సమాజంలో శాంతి భద్రతలు కాపాడటంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కార్యదర్శి బిల్లకంటి నందు, మలిపెద్ది చంద్రశేఖర్, భాను ప్రకాష్, కిషోర్, సంతోష్, శ్రీ హర్ష తదితరులు పాల్గొన్నారు.: డాక్టర్‌పై దాడి ఘటనపై ఆగ్రహం


