Category: Education

విద్యకు సంబంధించిన తాజా వార్తలు, పాఠశాలలు–కాలేజీలు–విశ్వవిద్యాలయాల సమాచారం, పరీక్షలు, ఫలితాలు, నోటిఫికేషన్లు మరియు విద్యార్థులకు అవసరమైన ముఖ్య అప్డేట్స్.

నాగర్ కర్నూల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రజా పాలన

నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆర్ట్స్ & కామర్స్ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. గీతాంజలి ఆధ్వర్యంలో అధ్యాపకులు, విద్యార్థులు శ్రమదానంలో పాల్గొన్నారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు RTF చెక్కులు

నాగర్ కర్నూల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద విడుదలైన RTF చెక్కులను ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలను కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

రేపే టెన్త్ హాల్ టికెట్ల విడుదల – అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ అవకాశం

తెలంగాణ పదోతరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు రేపు విడుదల కానున్నాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా కూడా హాల్ టికెట్ పొందే అవకాశం కల్పించారు.

తాడూరు ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ

నాగర్ కర్నూల్ జిల్లా తాడూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం మ్యాథమెటిక్స్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేసి పరీక్షల నిర్వహణపై అధికారులకు కీలక సూచనలు చేశారు.

కోడేరు కేజీబీవీ ఘటనపై ఎస్ఎఫ్ఐ ఆగ్రహం

నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు కేజీబీవీలో ఇంటర్ విద్యార్థిని ప్రసవించిన ఘటనపై ఎస్ఎఫ్ఐ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, SO ను టర్మినేట్ చేసి సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది.

పోలీస్ స్టేషన్లకు టెన్త్ ప్రశ్నపత్రాల తరలింపు

నాగర్ కర్నూల్ జిల్లాలో ఈ నెల 14 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షల కోసం ప్రశ్నపత్రాలను పోలీస్ బందోబస్తు మధ్య ఆయా పోలీస్ స్టేషన్లకు భద్రపరిచారు. జిల్లాలో 60 కేంద్రాల్లో 10,658 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

మోడల్ స్పోర్ట్స్ / వాటర్ స్పోర్ట్స్ అకాడమీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

2026-27 విద్యా సంవత్సరానికి గాను గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మోడల్ స్పోర్ట్స్ పాఠశాలలు మరియు వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో 5వ తరగతి ప్రవేశాల కోసం గిరిజన బాలబాలికల నుంచి దరఖాస్తులు కోరారు. జిల్లా స్థాయి ఎంపికలు మార్చి 11న కల్వకుర్తిలో…

జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా పరికరాల ప్రదర్శన

జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా బిజినపల్లి మండలం నందివడ్డేమాన్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ పరికరాల ప్రదర్శన, క్విజ్ పోటీలు నిర్వహించారు.

మండల విద్యాధికారిగా బాధ్యతలు స్వీకరన

నాగర్ కర్నూల్ మండల విద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించిన డి.కురుమయ్యను రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు ఎమ్మార్సీ భవనంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు.

నాల్గవ రోజు 5,763 మంది హాజరు

నాగర్ కర్నూలు జిల్లాలో ఇంటర్మీడియట్ నాల్గవ రోజు పరీక్షలకు 5,763 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పరీక్షలు సజావుగా జరిగాయని అధికారులు తెలిపారు.