తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అభ్యర్థులకు ప్రచారానికి అనుమతి ఉంది. అనంతరం ఎన్నికల నిబంధనల ప్రకారం మౌనకాలం అమల్లోకి రానుంది. ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అన్ని రాజకీయ పార్టీలు చివరి రోజు ప్రచారాన్ని ఉధృతంగా నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నేటితో ముగింపు Post navigation బీసీలను భారీ మెజారిటీతో గెలిపించండి నాగర్ కర్నూల్ ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తా