ఈ సందర్భంగా బహుజన ప్రజాశక్తి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నాయకురాలు ఇటికాల రాణి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నప్పటికీ విద్యా హక్కు చట్టం పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ప్రభుత్వాలు మారినా పేద మరియు బహుజన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించే విషయంలో ఇంకా లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు అవుతున్నప్పటికీ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం దురదృష్టకరమని ఆమె విమర్శించారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేసి విద్యా హక్కు చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్య హక్కు కోసం వచ్చే నెల నుంచి పాదయాత్ర కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో బహుజన ప్రజాశక్తి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కో-ఇన్చార్జి ఆర్.జీ. గోపి, అచ్చంపేట ఇన్చార్జి గుండెల్ని శివాని, కొల్లాపూర్ తాలూకా ఇన్చార్జి జోగు జ్యోతి, కొల్లాపూర్ కో-ఇన్చార్జి పొలమూరు పర్వతాలు, కల్వకుర్తి ఇన్చార్జి చందు, కో-ఇన్చార్జి మీనా, అచ్చంపేట కో-ఇన్చార్జి బాలు, పెద్దకొత్తపల్లి మండల ఇన్చార్జి పాదాల రాములు, కో-ఇన్చార్జి గడ్డం యాదగిరి, ఉషన్న గౌడ్, తాడూరు మండల ఇన్చార్జి బండారు అనిత తదితరులు పాల్గొన్నారు.
అలాగే బహుజన ప్రజాశక్తి సంఘానికి వెన్నుదండగా ఉంటానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రేవల్లి కేశవులు తెలిపారు.: విద్యా హక్కు చట్టం అమలు చేయాలని డీఈఓకు బహుజన ప్రజాశక్తి వినతి

