అయ్యప్ప భక్తుల ఆధ్వర్యంలో పడిపూజోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా పడిని గురుస్వాములు సుందర్, తీగల శేఖర్, జగన్ గురుస్వాములు దీపాలు వెలిగించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పూజా కార్యక్రమాలను భక్తులు భక్తి భావంతో తిలకించారు.
ఈ కార్యక్రమంలో అనిల్, మురళి, శేఖర్, ప్రవీణ్, యాదగిరి, సురేష్ గురుస్వాములు పాల్గొన్నారు. అనంతరం ప్రధాన పూజారి భక్తులకు ఆశీర్వచనాలు అందించగా, తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ ఉత్సవాలు భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపాయి.: శ్రీ అయ్యప్ప స్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా



