Author: voiceofnagarkurnool@gmail.com

నాగర్ కర్నూల్ ఎస్పీ కార్యాలయంలో 6 ఫిర్యాదులు

నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 6 ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదు దారులతో అడిషనల్ ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు స్వయంగా మాట్లాడి సమస్యలను తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశించారు.

ప్రజావాణి ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలి

నాగర్ కర్నూల్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ప్రజల నుంచి వచ్చిన అర్జీలు స్వీకరించారు. మొత్తం 44 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశించారు.

జనరల్ ఆసుపత్రిలో ప్రత్యేక సదరం శిబిరం విజయవంతం

నాగర్ కర్నూల్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో నిర్వహించిన ప్రత్యేక సదరం శిబిరంలో 44 మంది అంగవైకల్యంతో బాధపడుతున్న వారిని వైద్యులు పరీక్షించారు. అలాగే దృష్టిలోపం ఉన్న 10 మంది రోగులకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించినట్లు డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్…

పాఠశాల పరిశుభ్రత కార్యక్రమంలో చీపురు పట్టిన కలెక్టర్ సంతోష్

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశుభ్రత కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ స్వయంగా చీపురు పట్టి పాఠశాల ఆవరణను శుభ్రం చేస్తూ పాల్గొన్నారు. పాఠశాలలు పరిశుభ్రంగా ఉంటే విద్యార్థుల్లో…

నాగర్ కర్నూల్ బాలికల హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనం నాసిరకం:

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన నాణ్యతపై జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిర్ణయించిన మెనూ పాటించకపోవడంతో పాటు ఆహారం నాణ్యత కూడా బాగోలేదని గుర్తించి హెడ్‌మాస్టర్ మరియు…

పదో తరగతి విద్యార్థులకు వార్డెన్ రాధా ఆల్ ది బెస్ట్

నాగర్‌కర్నూల్ పట్టణంలోని ఎస్సీ గర్ల్స్ హాస్టల్‌లో పదో తరగతి విద్యార్థినులకు వార్డెన్ రాధా ప్రోత్సాహకరంగా సూచనలు చేస్తూ ఆల్ ది బెస్ట్ తెలిపారు. విద్యార్థినులు మంచి ఫలితాలు సాధించి హాస్టల్‌కు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

ఎర్రమంజిల్ జలసౌధలో సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష సమావేశం

హైదరాబాద్ ఎర్రమంజిల్ జలసౌధలో సాగునీటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టులపై సమీక్ష సమావేశం జరిగింది. సమావేశంలో నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పాల్గొన్నారు.

ఉప్పునుంతల కమ్యూనిటీ ఆసుపత్రిలో హెచ్పివి టీకా కార్యక్రమం ప్రారంభం

నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల కమ్యూనిటీ ఆసుపత్రిలో హెచ్పివి (HPV) వాక్సినేషన్ కార్యక్రమాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రారంభించారు. బాలికలను గర్భాశయ క్యాన్సర్ నుండి రక్షించేందుకు ఈ టీకా ఎంతో అవసరమని వైద్యాధికారులు తెలిపారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

నాగర్‌కర్నూల్ జిల్లాలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బడవత్ సంతోష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

పాలెం పరిశోధన కేంద్రంలో ఘనంగా ప్రాంతీయ మహిళా రైతు సదస్సు

నాగర్‌కర్నూల్ జిల్లా పాలెం పరిశోధన కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రాంతీయ మహిళా రైతు సదస్సు ఘనంగా జరిగింది. మహిళలకు నూతన వ్యవసాయ సాంకేతిక పద్ధతులపై అవగాహన కల్పించారు.